V1News Telangana

best news portal development company in india

పత్రికా స్వేచ్ఛపై ఏపీ ప్రభుత్వ దాడి – బోధన్‌లో కలకలం! . కొమ్మినేని అరెస్టు అనైతికం – బోధన్‌లో జర్నలిస్టుల బ్లాక్ బ్యాడ్జ్ నిరసన! . మీడియా గొంతు నులిపే యత్నం – బోధన్‌ అమ్బేద్కర్ చౌరస్తాలో ఉద్యమజ్వాల! సాక్షి జర్నలిస్టులపై దాడి ఖండనీయం – బోధన్‌లో ప్రజాసంఘాల ఆగ్రహం!..

SHARE:

బోధన్, జూన్ 10:
పత్రికా స్వేచ్ఛపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తూ బోధన్ పట్టణంలో జర్నలిస్టులు, ప్రజాసంఘాలు రోడ్డెక్కారు. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు, సాక్షి ఆఫీసులపై దాడుల నేపథ్యంలో మంగళవారం అంబేద్కర్ చౌరస్తాలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.

“ఇది రాజకీయ కక్ష సాధింపు. ఇది పత్రికా స్వేచ్ఛపై ప్రత్యక్ష దాడి!” అని ఐఎఫ్‌టియు జిల్లా అధ్యక్షుడు పుట్ట వరదయ్య ధ్వజమెత్తారు. జైలుకి వెళ్ళించడమే కాకుండా, అసత్య ఆరోపణలతో కేసులు పెట్టడం అనైతికమని టి.యు.సి.ఐ జిల్లా కార్యదర్శి బి.మల్లేష్ మండిపడ్డారు.

“జర్నలిస్టులను చైతన్యవంతులుగా నిలబెట్టే బదులు, గొంతు నులిపే చర్యలు ప్రజాస్వామ్యాన్ని కించపరుస్తున్నాయి,” అని పిడిఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు గౌతమ్ కుమార్ హెచ్చరించారు.

వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ప్రధాన కార్యదర్శి ఏశాల గంగాధర్ మాట్లాడుతూ, “ప్రజల వాణిని అణచివేయడం అంటే ప్రజలపై దాడి చేసినట్లే. ఇదేనా రాజ్యాంగబద్ధ పాలన?” అని ప్రశ్నించారు.

అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని, కొమ్మినేని శ్రీనివాసరావును వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు, ప్రజాసంఘాల నాయకులు, సాక్షి ప్రతినిధులు పాల్గొన్నారు.

ప్రశ్నిస్తే జైలు పాలా? గళమెత్తితే కేసుల ముసుగేనా? – అంటూ బోధన్‌ ప్రజలు ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india