V1News Telangana

best news portal development company in india

కాలువలు కనుమరుగై.. కబ్జాలు వెలుగులోకి! – అధికార యంత్రాంగం నిద్రలో?…

SHARE:

పంటకాలువలపై ప్రబలిన ఆక్రమణ మాఫియా! – అధికారుల నిర్లక్ష్యానికి ప్రజల గగ్గోలు
‘మేమే శాసనం’ అంటూ కాలువలపై కబ్జా రాజ్యం – సాలూరులో రెవెన్యూ చట్టాలకు ఛాలెంజ్
. కాలువలు కనుమరుగై.. కబ్జాలు వెలుగులోకి! – అధికార యంత్రాంగం నిద్రలో?
. రైతుల జీవనాధారాలపై ఆక్రమణ యుద్ధం – సాలూరులో డ్రైనేజ్ దుస్థితి
బస్టాండ్ పక్కనే భూ మాఫియా ! – చట్టం చేతబడి, కబ్జా పందెం సాగుతోంది.. ‌

(నిజామాబాద్ జిల్లా): సాలూర మండలం పంటకాలువలు సాగునీటి ధారలు కాకుండా ఇప్పుడు అక్రమ నిర్మాణాల వీధులుగా మారిపోయాయి. సాలూరు మండలంలో బస్టాండ్ సమీపంలో రైతుల పంటలకు జీవనాధారమైన కాలువలు ఇక చరిత్రగా మిగిలిపోయే పరిస్థితి. పలు శాశ్వత షాపులు, గోడలతో కూడిన నిర్మాణాలు పంట కాలువలపై పుట్టుకొచ్చాయి. ఇవి సాధారణ ప్రజలు కాదు… “మాకు ఏమి చేయలేరు” అన్న ధైర్యంతో కొన్ని బడా బాబులే ఈ భూ ఆక్రమణలకు తెరలేపారు.

వీటిని నిర్విరామంగా రెంటుకు ఇస్తూ వ్యాపారం చేస్తుండగా, చిన్నపాటి షాపులు పెట్టే సామాన్యులపై మాత్రం నోటీసులు, బెదిరింపులు, వసూళ్లతో హడావుడి. , సంబంధిత అధికారులు కొందరితో సెటిల్మెంట్లు చేసుకుంటూ ఈ ఆక్రమణలను కన్నపాపలా చూసే పరిస్థితి కనిపిస్తోంది.
ఇక డ్రైనేజ్ నీరు వెళ్లే మార్గాలు మూసుకుపోయి, కాలువల్లోని నిల్వ నీటి దుర్వాసనతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణం కావడం ఖాయం. ఇది కేవలం అక్రమ నిర్మాణాల సమస్య మాత్రమే కాదు – ఇది రైతుల హక్కులపై నేరప్రకటన.
ప్రజల ప్రశ్నలు స్పష్టంగా ఉన్నాయి:
అధికారులు ఎక్కడ?
సిబ్బంది ఎందుకు మౌనంగా ఉన్నారు?
అక్రమ నిర్మాణాలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు?
ఇకనైనా అధికారులు మేలుకుని, పంటకాలువలపై వున్న ఈ అక్రమ నిర్మాణాలను తొలగించి రైతులకు వారి హక్కులను తిరిగివ్వాలి. ప్రజల ఆగ్రహాన్ని పరీక్షకు పెట్టకండి – రేపటికి ఇది పెద్ద ఉద్యమంగా మారే ప్రమాదం ఉంది.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india