V1News Telangana

best news portal development company in india

ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన మాల సోదరులు….

SHARE:

– చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి దక్కిన మంత్రి పదవి

– మంత్రివర్గంలో చోటు ఇవ్వడం పట్ల సంబరాలు జరుపుకున్న మాల సోదరులు

– నసురుల్లాబాద్ అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షులు ఉల్లెంగ బాల సాయిలు

నసురుల్లాబాద్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: దళిత (మాల) వర్గానికి చెందిన చెన్నూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే జి వివేక్ వెంకటస్వామి కి మంత్రి పదవి ఇవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ సోమవారం రోజు నసురుల్లాబాద్ మండల కేంద్రంలో మండల అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. ఒకరికొకరు మిఠాయిలు పంచిపెట్టుకొని ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ లకు శుభాకాంక్షలు మరియు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నసురుల్లాబాద్ మండల అంబేద్కర్ సంఘం అధ్యక్షులు ఉల్లెంగ బాల సాయిలు, కామారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు గౌడి నర్సింలు, మండల సలహాదారులు కొక్కెర సాయిలు, ఉల్లెంగ సంగయ్య, గోపి, నెమలి శంకర్, పండరి, బాలయ్య, పోచయ్య, రాములు, కిష్టయ్య, మొగులయ్య, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india