V1News Telangana

best news portal development company in india

ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం…..

SHARE:

– సాక్షి సీనియర్ జర్నలిస్టును అరెస్టు చేయడం పట్ల నిరసన వ్యక్తం చేసిన మండల ప్రెస్ క్లబ్

– జర్నలిస్టులపై పక్షపాత వైఖరి ప్రదర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం

– బేషరత్తుగా వెంటనే విడుదల చేయాలని డిమాండ్

– లేనియెడల ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరిక

– ప్రెస్ క్లబ్ మండల అధ్యక్షులు ముత్తకుంట వేణుగోపాల్ గౌడ్

నసురుల్లాబాద్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో సోమవారం రోజు మండల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సాక్షి సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేసిన తీరును ఖండిస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ముత్తకుంట వేణుగోపాల్ గౌడ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జర్నలిస్టులపై పక్షపాత వైఖరి ప్రదర్శిస్తుందన్నారు. గతంలో సాక్షి రిపోర్టర్ల ఇళ్లపై దాడులు నిర్వహించిన ఘటనలు గుర్తు చేశారు. సోమవారం రోజు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ ను కక్షపూరిత ధోరణితో అరెస్టు చేయడం సరికాదని అన్నారు. మీడియాలో డిబేట్ నిర్వహించినప్పుడు ఇరు వర్గాల నాయకులు వ్యతిరేకంగా మాట్లాడుకోవడం సాధారణంగా జరిగే విషయం అని.. అలాంటి సంఘటనల్లో యాంకర్లకు ఎటువంటి సంబంధం సంబంధం లేదని అయినప్పటికీ వారి మాటలను వక్రీకరించి జర్నలిస్టుపై అక్రమంగా కేసులు పెట్టి అరెస్టు చేయడం ఇంతవరకు న్యాయమని నిలదీశారు. అతనిపై ఎటువంటి కేసులు నమోదు చేయకుండా బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల అన్ని మండలాలలో నిరసన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి నగేష్, ఉపాధ్యక్షులు రాజా గౌడ్, సీనియర్ జర్నలిస్ట్ మహెబూబ్, భవాని సింగ్, రమేష్, ప్రవీణ్ కుమార్, మహేష్ గౌడ్, దాది మల్లేష్, హన్మండ్లు, మహేబూబ్ తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india