V1News Telangana

best news portal development company in india

పిసిసి అధ్యక్షుడి నివాసం వద్దనే రాజీనామా ! . మహేష్ గౌడ్ సమక్షంలో బోధన్ నాయకుల తలుపు బంద్! . బోధన్ కాంగ్రెస్‌కు బలమైన గుండెజల్లి – పదవులకు సైతం రాజీనామా! . వర్గపోరులో వేడెక్కిన బోధన్ కాంగ్రెస్.. రాజీనామాలతో పటాకులు!

SHARE:

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు ముదిరుతున్న సూచనలు కనపడుతున్నాయి. నేడు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి హైదరాబాద్ నివాసంలో బోధన్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కలసి శాకింగ్ నిర్ణయం తీసుకున్నారు.
వారు బోధన్ నియోజకవర్గానికి సంబంధించి తమకు ఉన్న అన్ని పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
ఈ రాజీనామా వెనుక తీవ్ర అసంతృప్తి, నాయకత్వంపై విమర్శలు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కకపోవడం, హైకమాండ్ నిర్లక్ష్యం వంటి అంశాలు ఇక్కడి నేతల్లో అసహనం రేపినట్లు తెలుస్తోంది.
“మాకు పార్టీలో ఇక స్థానం లేదు.. సమర్ధన లేదు.. నియోజకవర్గాన్ని పట్టించుకోని పార్టీ నేతృత్వానికి దీక్షగా ఈ రాజీనామా” అంటూ నేతలు తమ అసంతృప్తిని వ్యక్తపరిచారు.
ఇప్పటికే ఎన్నికల తరువాత నియోజకవర్గంలో నాయకత్వ గందరగోళం నెలకొనగా, ఈ రాజీనామాలతో కాంగ్రెస్ స్థానికంగా బలహీనపడే అవకాశం కనిపిస్తోంది.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india