V1News Telangana

best news portal development company in india

శివాజీ – కృష్ణ ముఠాలు: బీర్కూర్‌ అరణ్యంలో పేకాట రాజ్యం! చట్టం చేతబడి.. మాఫియాకే అండ! “మా పిల్లలు అప్పుల ఊబిలో పడ్డారు,..

SHARE:

బీర్కూర్ (కామారెడ్డి జిల్లా):
మంజీరా బ్రిడ్జ్‌ సమీపంలో… అడవుల్లోని మౌనాన్ని చీల్చుతున్నది ఇప్పుడు పేకాట ముఠాల గగ్గోలు!
శివాజీ – కృష్ణ పేరుతో పేకాట మాఫియా బీర్కూర్‌ పరిసరాలను తమ రాజధానిగా మలుచుకుంది. అడవిలో, జాతీయ రహదారి పక్కన, చెరువుల గుట్టల్లో ఎక్కడ చూసినా పేకాటే దర్శనమిస్తుంది. శివాజీతో పాటు మరికొంతమంది ముఠా సభ్యులు ప్రజల పాలనను ఎగతాళి చేస్తూ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు….

“మా పిల్లలు అప్పుల ఊబిలో పడ్డారు, మా భవిష్యత్తు పేకాట తినేస్తోంది” అంటూ స్థానికులు వాపోతున్నారు.
అయితే… పోలీసులు మాత్రం వీరి దారుణాలకు కాపలాదార్లుగా మారిపోయారు. పదే పదే సోదాలు చేస్తామంటూ డ్రామాలు… కానీ లోపల మాత్రం లంచాల దందా!

ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం నిశ్శబ్దం పాటించడంలోనూ అనేక అనుమానాలు ముసురుతున్నాయి.
ఎవరి అండతో పేకాట ముఠాలు ఇంత రెచ్చిపోతున్నాయో ప్రజలు బాగా తెలుసుకుంటున్నారు!

బీర్కూర్ ప్రజలు గళమెత్తుతున్నారు –

> “ఇవ్వాళ పేకాట… రేపు మాదక ద్రవ్యాలు… ఈ అరణ్యమే మాఫియాల అడవిగా మారుతుందా?”
“చట్టం కోసం పోరాడేవాళ్లు మాఫియాలకు రక్షకులవుతే మాకు న్యాయం ఎప్పుడు దక్కుతుంది?”

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india