హైదరాబాద్, జూన్ 8 (ప్రత్యేక ప్రతినిధి):
తెలంగాణ రాజకీయాల్లో ఊహించని మలుపు!
మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో పలువురి పేర్లు పరిగణనలో ఉన్నప్పటికీ, చివరికి ఎవరూ ఊహించని విధంగా ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు మంత్రి పదవి దక్కింది. మధ్యాహ్నం 12:00 నుంచి 12:20 మధ్య ముగ్గురు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
కావాలని గట్టిగా లాబీయింగ్ చేసిన కవ్వంపల్లి సత్యనారాయణ పేరు చివరిలో పక్కకు తప్పిపోవడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. అదే సమయంలో అడ్లూరి లక్ష్మణ్ ఎంపిక అవ్వడం మాదిగ సామాజిక వర్గానికి కాంగ్రెస్ ఇచ్చిన పెద్ద సంకేతంగా పరిగణించబడుతోంది.
సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ, ముదిరాజ్, మాల, మాదిగ వర్గాలకు మంత్రిపదవులు కేటాయించిన కాంగ్రెస్ అధిష్ఠానం… పొలిటికల్ బాలెన్స్ సమంగా ఉంచేందుకు వ్యూహాత్మకంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు సమాచారం.
వివరాల్లోకి వెళ్తే –
వాకిటి శ్రీహరి ముదిరాజ్‌కు పాత హామీ మేరకు మంత్రి పదవి దక్కింది. గడ్డం వివేక్కి పార్టీలోకి వచ్చే సమయంలోనే హామీ ఇచ్చారని అంటున్నారు. ఇక మాదిగ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు గత కొన్ని రోజులుగా ఢిల్లీ దాకా పోయి వినతిపత్రాలు అందించడంతో… అడ్లూరి లక్ష్మణ్‌కి అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఈ ఎంపికలతో తెలంగాణ కేబినెట్లో సామాజిక సమతుల్యత స్థిరపడుతుందా? లేక ఇంకెన్నో అసంతృప్తులకి ఇది తెరదీయుతుందా అన్నది చూడాల్సిన విషయమే!
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








