V1News Telangana

best news portal development company in india

రెవంత్ గవర్నమెంట్‌లో భారీ తేడా – రేపే కేబినెట్‌ మార్పులు! హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ – మంత్రివర్గ విస్తరణకు శుభసంధ్యా! ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి ఛాన్స్ పక్కా! ఊహాగానాలకు ఫుల్‌స్టాప్ – రేపే మంత్రివర్గ విస్తరణ‼️ కాబోయే మంత్రులకు రెడీ అవ్వండి – రేపే ప్రమాణ స్వీకారం?

SHARE:

రాజకీయాల్లో వేడి పెరిగింది… రేపు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరగనుందని తెలుస్తోంది. కాంగ్రెస్ హైకమాండ్ చివరికి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఇక ప్రచారాలు నిజం కాబోతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద ఉన్న జాబితా ఇప్పటికే దిల్లీకి వెళ్లిపోయినట్టు సమాచారం. ఆ జాబితాలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేరు టాప్‌లో ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

ప్రత్యేకంగా రెడ్డి, బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలను ప్రాధాన్యంలో ఉంచిన ఈ విస్తరణలో ఓసీలకు నో ఎంట్రీ అన్నట్టే కనిపిస్తోంది. గత కొంతకాలంగా మంత్రిపదవిపై ఆశలు పెట్టుకున్న వారిలో కొందరికే ఈసారి లబ్ధి చేకూరనుంది.

ప్రమాణ స్వీకార కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ శర్మకు ఇప్పటికే అధికార వర్గాలు సమాచారం ఇచ్చినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. రేపటి ముహూర్తాలు ఇప్పటికే ఖరారైనప్పటికీ… అధిష్ఠానం నుంచి తుది అంగీకారం లభించిన తరువాతే ప్రక్రియ ప్రారంభమవుతుంది.

ఇక రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్– సీఎం రేవంత్ రెడ్డి మధ్య తీవ్రంగా చర్చలు జరిగాయి. కొత్త జాబితా మీద పూర్తిస్థాయి సన్నాహాలు పూర్తయినట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం జారీచేసే తుది పేర్ల ప్రకటన కోసం వేచి చూస్తున్నారు నేతలు. రాత్రిలోగా ప్రకటన వస్తే… రేపు ఉదయం ప్రమాణ స్వీకార వేడుక జరగడం ఖాయం.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india