V1News Telangana

best news portal development company in india

డిల్లీ గ్రీన్ సిగ్నల్! బోధన్ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఖాయమా?” “తెలంగాణ మంత్రివర్గంలో మార్పుల గాలి… సుదర్శన్ రెడ్డి పేరు ఫిక్స్?” “నిజామాబాద్‌ నుంచి కుర్చీ దక్కనుందా? రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ” “జూన్ 8కి కేబినెట్ విస్తరణ… కొత్త చాప్టర్‌కు రెడీ అవుతున్న తెలంగాణ!”

SHARE:

 తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ భరితమైన పరిస్థితి నెలకొంది.

జూన్ 8న రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరగనుందనే వార్తలకు బలం చేకూరుతోంది. ఢిల్లీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కేబినెట్‌లో కీలక మార్పులు జరుగనున్నాయి.ఈ క్రమంలో నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేరు ప్రాధాన్యతతో వినిపిస్తోంది. మొదటి నుంచే ముఖ్యమంత్రి వైఖరికి అండగా నిలుస్తున్న ఆయనకు చివరికి మంత్రిపదవి రూపంలో గౌరవం దక్కబోతోందన్న మాటలతో బోధన్ రాజకీయ వర్గాల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి.

ఇక ఇతర జిల్లాల నుంచి కూడా కొత్త ముఖాలకు అవకాశాలు కల్పించే యోచనలో ప్రభుత్వం ఉందని సమాచారం.
అయితే… ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అదే సమయంలో క్యాబినెట్ లోని కొందరు మంత్రుల పనితీరుపైనా విశ్లేషణలు మొదలయ్యాయి.

వచ్చే 24 గంటలు తెలంగాణ రాజకీయ దిశను మారుస్తాయనడంలో అతిశయోక్తి ఏమీలేదు!

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india