V1News Telangana

best news portal development company in india

శిథిల భవనంతో పాటు గౌరవం కూడా కూలింది! కుబీర్‌లో హెడ్‌మాస్టర్‌ను నిలదీసిన గ్రామస్తులు…

SHARE:

నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని అంతర్నీ గ్రామంలో శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనం ఈరోజు అధికారుల పర్యవేక్షణలో పూర్తిగా కూల్చివేయబడింది. భద్రతా దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్న అధికారులు, పాత భవనం వద్ద పరిస్థితిని పరిశీలించారు. అయితే భవనంపై అధికారుల చర్యల కంటే, అక్కడ విధులు నిర్వహిస్తున్న హెడ్‌మాస్టర్ సుభాష్ పై గ్రామస్థుల ఆగ్రహం ఎక్కువగా కనిపించింది.

పిల్లల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టిన ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్రంగా స్పందించారు. చదువు పేరిట స్కూల్‌కు రాకుండా గైర్హాజరయ్యే హెడ్‌మాస్టర్ సుభాష్‌ను MEO సమక్షంలోనే గ్రామస్తులు నిలదీశారు. “ఇతను ఇక్కడే ఉంటే మా పిల్లలను స్కూల్‌కి పంపము,” అంటూ తల్లిదండ్రులు స్పష్టం చేశారు. సుభాష్ ఎప్పుడూ క్లాస్‌కు హాజరు కావడం లేదని, పిల్లలకు బోధన అన్నదే జరగడం లేదని వారు వాపోయారు.
ఇటువంటి నిర్లక్ష్యపు వ్యవహారాలపై సంబంధిత విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించాలని, పాఠశాలలో నాణ్యతైన విద్య అందేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

chandre Prakash
Author: chandre Prakash

నిర్మల్ డిస్టిక్. స్టాఫ్ రిపోర్టర్. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్. ప్రకాష్. +91 90102 20533

best news portal development company in india