V1News Telangana

best news portal development company in india

ప్రపంచం దృష్టిని ఆకర్షించిన గొప్ప నాయకులు నరేంద్ర మోడీ….

SHARE:

– కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అవగాహన కల్పించాలి…..

– వికసిత్ భారత్ సాకారం దిశగా అడుగులు

– అసాధ్యం అనుకున్న పనులను పట్టుదలతో సాధించిన ఘనుడు

– బిజెపి రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ

రుద్రూర్ ప్రతినిధి:

నిజామాబాద్ జిల్లా: బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూచనల మేరకు రుద్రూర్ మండల కేంద్రంలో శనివారం రోజు మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో “బిజెపి పార్టీ వివిధ కార్యక్రమాల మండల శాఖ కార్యశాల” కార్యక్రమాన్ని కార్యకర్తలతో కలిసి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జహీరాబాద్ పార్లమెంట్ కో కన్వీనర్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలపాటి హరికృష్ణ మాట్లాడుతూ నరేంద్ర మోడీ దేశ ప్రధానమంత్రిగా 11 సంవత్సరాల పరిపాలన కాలంలో దృడ సంకల్పంతో ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ భారత దేశాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్నారని కొనియాడారు. ప్రధానమంత్రి సమయస్ఫూర్తితో సమర్థవంతంగా నిర్ణయాత్మక పరిపాలనతో భారతదేశం ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గా అవతరించిందని మరియు వికసిత్ భారత్ సాకారం జరిగే దిశగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. పట్టుదలతో అసాధ్యం అనుకున్న పనులను కూడా పూర్తిచేస్తూ ఎన్నో చారిత్రాత్మక విజయాలతో మోడీ ప్రభుత్వం 11 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందని ..ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకొని యావత్ భారతదేశం గౌరవ ప్రధానమంత్రి కి అభినందలు తెలుపుతుందని కీర్తించారు.అదే విధంగా ఆపరేషన్ సింధూర్ చారిత్రాత్మక విజయం సాధించిన నేపథ్యంలో శక్తివంతమైన భారతదేశాన్ని చూసి ప్రపంచ దేశాలు వణికి పోతున్నాయి. ఈ విజయం పట్ల భారతీయులందరూ గర్విస్తున్నారని తెలిపారు.ఈ కార్యక్రమం లో జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రశాంత్ గౌడ్,ప్రధాన కార్యదర్శి ఏముల గజేందర్, రేపల్లె సాయి ప్రసాద్, బేగరి వినోద్ కుమార్, బేగరి శివప్రసాద్,సతీష్ పవార్, గంగాధర్, సాయికుమార్, నాగరాజకుమారి, అంకెరాజేష్,విజయ్,శంకర్, భోజి గొండ అనిల్, రవితేజ, శ్రీనివాస్,మండల సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india