V1News Telangana

best news portal development company in india

తహసిల్దార్ ను సన్మానించిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు….

SHARE:

– స్వాగతం పలికి ఘనంగా సత్కారం

– ప్రజా సమస్యలపై పారదర్శకంగా వ్యవహరించాలని సూచనలు

– మండల అభివృద్ధి కొరకు తమ వంతు సహకారం అందిస్తామని స్పష్ఠీకరణ

– బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు గొడిసెల నర్సింలు గౌడ్

నసురుల్లాబాద్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల తహసిల్దార్ గా సువర్ణ ఇటీవల బదిలీపై వచ్చి విధులు నిర్వహిస్తున్నారు. గురువారం రోజు నసురుల్లాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు తహసిల్దార్ కార్యాలయంలో ఆమెను కలిసి స్వాగతం పలుకుతూ పూలమాల శాలువాతో ఘనంగా సన్మానించారు. తహసిల్దార్ గా ప్రజా సమస్యలపై పారదర్శకంగా వ్యవహరించాలని అన్నారు. మండల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని నాయకులు ఆమెతో తెలిపారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నర్సింలు గౌడ్, అఫ్రోజ్, టేకుర్ల సాయిలు, రీహన్, హాజీపూర్ రాము, అల్లం గంగారాం,లక్ష్మణ్ , అల్లం రాములు, గంపల శంకర్, బద్రి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india