V1News Telangana

best news portal development company in india

అక్రమాలకు అడ్డు చెప్పిన విలేకరిపై దాడి – బోధన్‌లో MSR బార్ నిర్వాహకుల అరాచకం! . అర్ధరాత్రి బార్‌ దందా – ప్రశ్నించిన విలేకరిపై దాడి! MSR బార్‌పై బీఆర్ఎస్ కార్యకర్తల ఆగ్రహం – ఎక్సైజ్ శాఖకు మెమోరాండం . అర్ధరాత్రి బార్ లో బూతులు, బీర్ – బోధన్‌లో శాంతిభద్రతలకు ముప్పు! . విలేకరిని బెదిరించిన బార్ యజమాన్యం – వెంటనే చర్యలు తీసుకోవాలి: ప్రజల డిమాండ్…

SHARE:

బోధన్ పట్టణం: బోధన్ ప్రధాన రహదారిపై ఉన్న MSR బార్‌ అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారికంగా రాత్రి 11 గంటల వరకు మాత్రమే అనుమతి ఉన్నా, బార్ యజమాన్యం రాత్రి 12:10 గంటల వరకూ షట్టర్లు తెరిచి మద్యం విక్రయాలు కొనసాగిస్తున్నారని ప్రముఖ న్యూస్ ఛానెల్‌ బహిర్గతం చేసింది.

ఈ అంశాన్ని మరుసటి రోజు పరిశీలించడానికి వచ్చిన స్థానిక పత్రికా విలేకరి భూనబాద్‌కు చెందిన సీనియర్ జర్నలిస్టు ‘సయ్యద్‌’పై బార్ నిర్వాహకులు దాడికి తెగబడ్డారు. ఆయనకు మౌఖికంగా దాడి చేసి, ఫోన్ లాక్కొని బెదిరించినట్టు సమాచారం. ఒక విలేకరి విధిని నిర్వర్తిస్తున్న సమయంలో జరిగిన ఈ దాడిని పత్రికా వర్గాలు, ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.
ఈ ఘటనపై బీఆర్ఎస్ పార్టీ బోధన్ పట్టణ శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎక్సైజ్ శాఖ అధికారులకు మెమోరాండం అందజేసింది. ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా బార్‌ను పట్టణంలోని ప్రధాన రహదారిపై నడిపించడం అన్యాయమని పేర్కొన్నారు. విద్యార్థులు, కంటి చికిత్స కోసం వచ్చే రోగులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
బార్‌ను పట్టణం వెలుపల తరలించాలని, విలేకరిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ కార్యకర్తలు, స్థానికులు ఏకగాథంగా డిమాండ్ చేస్తున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india