V1News Telangana

best news portal development company in india

అమరవీరుల స్థూపాన్ని నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం: బోధన్ బీజేపీ నేతల నిరసన…

SHARE:

బోధన్, జూన్ 2:తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద గల అమరవీరుల స్థూపాన్ని బీజేపీ నేతలు శుభ్రంగా కడిగి, పుష్పమాలలు సమర్పించి, అమరవీరులకు నివాళులు అర్పించారు. వీరి త్యాగాలను స్మరించుకుంటూ ఘనంగా ఆచరించారు.

ఇదే సందర్భంలో, ఈ ఏడాది పట్టణంలోని అమరవీరుల స్థూపాన్ని ప్రభుత్వం పక్షాన కనీసం శుభ్రపరచకపోవడం పట్ల బీజేపీ జిల్లా కార్యదర్శి మారోజు సుధాకర్ చారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి ఏడాది ఫూల్ అలంకరణలు, లైటింగ్‌ లతో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా నిర్వహించేవారు. అయితే ఈ ఏడాది స్థూపాన్ని పూర్తిగా విస్మరించడాన్ని ఆయన దుయ్యబట్టారు.

ఈ కార్యక్రమంలో బోధన్ పట్టణ బీజేపీ అధ్యక్షులు పసుపులేటి గోపి కిషన్, మాజీ బీజేపీ ఫ్లోర్ లీడర్ మాసిని వినోద్ (చిన్న), బీజేపీ ప్రధాన కార్యదర్శి రాజులదేవి పవన్ కుమార్, బీజేవైఎం అధ్యక్షుడు ఎనుగంటి గౌతమ్ గౌడ్, బివిఎస్ అధ్యక్షుడు కస్ప లింగం, సాగర్ గౌడ్, ఫణి, బాలు, కిషోర్, శివ తదితరులు పాల్గొన్నారు.

– భారతీయ జనతా పార్టీ, బోధన్ పట్టణ శాఖ

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india