V1News Telangana

best news portal development company in india

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ…..

SHARE:

– ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ

– ఇందిరమ్మ నమూనా ఇంటిని రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించిన వైనం

– రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి

కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: బాన్సువాడ నియోజకవర్గం పరిధిలో శుక్రవారం రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ తో కలిసి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ, ఇందిరమ్మ నమూనా ఇంటిని రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. ఈ క్రమంలో ముందుగా బాన్సువాడ గ్రామీణ మండలం బోర్లం క్యాంపులో ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ నిర్వహించారు. అనంతరం కోటగిరి మండల కేంద్రంలో నిర్మించిన ఇందిరమ్మ మోడల్ ఇంటిని రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. అనంతరం పోతంగల్ మండలం అంగర్గా ఫారం లో సామూహికంగా నిర్మించనున్న ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ నిర్వహించారు. పోతంగల్ మండలం లో 310 మంది, కోటగిరి మండలంలో 200 మంది మొత్తం 510 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, కోటగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ గైక్వాడ్ హనుమంతు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india