– ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహణ
– సైనికులను సత్కరించి వారి సేవలకు నీరాజనాలు తెలిపిన ప్రజలు
– రాజకీయాలకు అతీతంగా పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు
– సైనికులకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు పుణ్యమూర్తులు
– బిజెపి రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ
రుద్రూర్ ప్రతినిధి:
నిజామాబాద్ జిల్లా: రుద్రూర్ మండల కేంద్రం లో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో తిరంగా యాత్ర తహసిల్దార్ కార్యాలయం నుండి శివాజీ చౌక్ వరకు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయవాది కోనేరు తరుణ్ సాయి తేజ మాజీ సైనికులు సంజీవ్ కుమార్ మరియు ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న సైనికులు నవీన్ కుమార్ లను పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ లో పాల్గొని పాకిస్తాన్ దేశంలో తలదాచుకుంటున్న ఉగ్రవాద స్థావరాలను మట్టి కరిపించి భారతదేశానికి విజయాన్ని అందించడంలో ఎంతో కృషి చేశారని కొనియాడారు. జవాన్లు దేశ సరిహద్దులలో భార్యా పిల్లలను, తల్లిదండ్రులను వదిలిపెట్టి వెళ్లి దేశం పై భక్తితో, అంకితభావంతో విధులు నిర్వహించడం వలన దేశ ప్రజలందరము ప్రశాంతంగా జీవిస్తున్నామని గుర్తు చేశారు. సైనికులను కన్న తల్లిదండ్రులు ఎంతో పుణ్యమూర్తులని అన్నారు. దేశ రక్షణ కొరకు తమ బిడ్డలను ఆర్మీలో చేరిపించి అఖండ భారతావని రుణం తీర్చుకుంటున్నారని కొనియాడారు. ప్రతి భారతీయ పౌరులు సైనికుల యొక్క సేవలను కీర్తించాలని విజ్ఞప్తి చేశారు. విపత్కర పరిస్థితులలో సైనికులు ఎంతో ఉత్సాహంగా పనిచేసే విధంగా వారికి దేశ ప్రజలందరూ వారిలో ఉత్తేజం నింపేలా సహకారంగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి కామారెడ్డి జిల్లా కౌన్సిల్ మెంబర్ సున్నం సాయిలు, మండల సీనియర్ నాయకులు ప్రశాంత్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇందూర్ శేఖర్, కోనేరు తరుణ్ సాయి తేజ, బిజెపి రుద్రూర్ మండల ఉపాధ్యక్షులు కృష్ణంరాజు, కటిక రామ్ రాజ్, పార్వతి మురళి, అనిల్, మండల సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








