V1News Telangana

best news portal development company in india

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ…..

SHARE:

– ముఖ్యఅతిథిగా హాజరైన జూపల్లి కృష్ణారావ్

– ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం గురించి ప్రజలకు అవగాహన

– తెలంగాణ వ్యవసాయ శాఖ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి

బాన్సువాడ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: బాన్సువాడ పట్టణంలో గురువారం రోజు బీర్కూర్ మరియు నసురుల్లాబాద్ మండలాలకు చెందిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిసిసిబి మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ల చేతుల మీదుగా పట్టాలు పంపిణీ చేశారు. బీర్కూర్ మండలానికి చెందిన 374 మంది , నసురుల్లాబాద్ మండలానికి చెందిన 326 మంది మొత్తం 700 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఇళ్ళ నిర్మాణం పై ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి కొప్పిశెట్టి, ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india