V1News Telangana

best news portal development company in india

మంత్రి పర్యటన నెపథ్యంలో ముధోల్ నేతలు హౌస్ అరెస్ట్ లోకేశ్వరం పర్యటన సందర్భంగా పలు పార్టీల నేతల నిర్బంధం….

SHARE:

  1. ఇంచార్జ్ మంత్రి దనసరి సీతక్క ఈ రోజు ముధోల్ నియోజకవర్గంలోని లోకేశ్వరం మండలంలో పర్యటించనున్నారు. ఆమె పర్యటనను పురస్కరించుకుని, ముధోల్ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుడు విలాస్ గాదేవార్ గారి తో పాటు నిమ్మ సురేష్, అబ్దుల్ వాసే రసూల్, డా. దగ్దే కపిల్, దగ్దే మహిపాల్, దగ్దే టుకేందర్, షేక్ అమీర్ గారిని స్థానిక పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

ఈ చర్యపై సంబంధిత నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును అణచివేయాలనే ప్రయత్నంగా ఇది భావిస్తున్నామని వారు పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలపై స్పందన తెలియజేయడం ప్రజలకు ఉన్న హక్కు అని, తాము ఎటువంటి శాంతిభంగాన్ని సృష్టించకుండా నిరసన తెలపాలనుకున్నామని వారు వెల్లడించారు.

ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్య విలువలకు భంగం కలిగించేవని పలువురు నాయకులు విమర్శించారు. అధికారుల వైఖరిపై ప్రజా సంఘాలు స్పందించాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india