V1News Telangana

best news portal development company in india

పేకాటకు రాజ్యం…? కామారెడ్డి జిల్లా బీర్కూర్.సరిహద్దుల్లో పేకాట పరాకాష్టకు చేరిన వేళ – బాధితుల గొంతు ఎవరూ వినడంలేదే!

SHARE:

కామారెడ్డి:
బీర్కూరు, బైరాపూర్, దుర్గి సరిహద్దుల్లో పేకాట ప్రబలంగా కొనసాగుతున్నదన్న ఆరోపణలు జనం నుంచి వెల్లువెత్తుతున్నాయి.

వ్యవసాయ భూములు పేకాట స్థావరాలుగా మారిపోతుండగా, నిత్యం విందు, మద్యం, అక్రమ వడ్డీ సదుపాయాలతో రాయుళ్లు రాజుల్లా పీకట ఆడుతుండటం సామాన్యులకు తీవ్ర ఆవేదన కలిగిస్తోంది.
పేకాట నిర్వాహకుల పేర్లు ప్రతి పల్లెటూరిలో వినిపిస్తున్నా – అధికారులు మాత్రం మూగబోయారని, పై నుంచి కింద స్థాయికి ముడిపడి ఉన్న వ్యవస్థ మూలంగానే ఇప్పటివరకు చర్యలు కనపడలేదని ప్రజలు మండిపడుతున్నారు.

“కాసులు కట్టితే చట్టాలెక్కడ..? పేకాటకు బాసట ఎవరిది?” అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
నసురుల్లాబాద్ సరిహద్దుల్లో ఓసారి ఆపిన పేకాట మళ్లీ ఎప్పుడెప్పుడు తిరిగి ప్రారంభమవుతుందోననే ఉత్కంఠ ప్రజల్లో నెలకొంది. ప్రతి నెలా లక్షల్లో మునిగిపోయే సామాన్యులు, కుటుంబాలు రోడ్డున పడుతున్నా – అధికార యంత్రాంగం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇప్పటికైనా మేలుకోండి – పేకాట స్థావరాలపై కఠిన చర్యలు తీసుకోండి!
పేకాటపై ప్రశాంతంగా ఉన్న ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలించాల్సిన సమయం ఆసన్నమైంది.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india