V1News Telangana

best news portal development company in india

సైనిక్ పాఠశాలల్లో విజ్ఞాన్ విద్యార్థుల ఘన విజయం – 23లో 17 మంది అర్హత సాధింపు…

SHARE:

బోధన్ : 2025 ఏప్రిల్ 5వ తేదీన ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ప్రవేశాల కొరకు అర్హత పరీక్షలు నిర్వహించారు.బోధన్ పట్టణంలోని విజ్ఞాన్స్ కోచింగ్ సెంటర్ విద్యార్థులు ప్రవేశ పరీక్షలో ర్యాంకులు సాధించి వికసించారు.సోమవారం సైనిక్ పాఠశాలలో ప్రవేశ అర్హత పరీక్షలో మంచి ర్యాకులు సాధించిన విద్యార్థినీ విద్యార్థులను బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో శాలువాలతో సన్మానించి మెమొంటోళ్లను అందించి శుభాకాంక్షలు తెలిపారు.

కోచింగ్ సెంటర్ నిర్వాహకులు వివేక్ ను అభినందించారు.మరింత మంది విద్యా కుసుమాలను వికసింప చేయాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా కోచింగ్ సెంటర్ నిర్వాహకులు వివేక్ మాట్లాడుతూ 23 మంది విద్యార్థులు అర్హత పరీక్ష రాయగా 17 మంది విద్యార్థులు ప్రవేశాల కొరకు అర్హత సాధించినట్లు స్పష్టం చేశారు.పోతంగల్ గ్రామానికి చెందిన సూదం మయాంక్ ప్రవేశ పరీక్షలో 300కు గాను 283 మార్కులు సాధించి జాతీయ స్థాయిలో 361 ర్యాంకులు సాధించి సత్తా చాటారు.రాష్ట్ర స్థాయిలో 10 ర్యాంకులు వచ్చినట్లు వెల్లడించారు.సైనిక్ పాఠశాల ప్రవేశాలకు అర్హత సాధించిన విద్యా కుసుమాలను కోచింగ్ సెంటర్ నిర్వాహకులు వివేక్ మరియు ఉపాధ్యాయులు అభినందించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు,కోచింగ్ సెంటర్ నిర్వాహకులు ఉన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india