నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ పై అర్థం పర్టం లేని ఆరోపణలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని మాజీ వైస్ ఎంపీపీ సీనియర్ నాయకులు సోలంకి భీమ్ రావ్, బిజెపి పట్టణ అధ్యక్షులు రావుల రాము, మండల అధ్యక్షురాలు సిరం సుష్మరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎనపోతుల మల్లేష్, నాయకులు పండిత్ రావు, రావుల పోశెట్టి, సాహెబ్ రావ్, సట్ల సాయినాథ్ అన్నారు. ఆదివారం బైంసా పట్టణంలోని ఎస్ ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఎమ్మెల్యే పై బి ఆర్ ఎస్ నాయకులు డాక్టర్ కిరణ్ కొమ్రే వార్ చేస్తున్న విమర్శలను చూస్తుంటే రాజకీయంగా ఆయనకు అవగాహన లేదనిపిస్తుందన్నారు. వారానికోసారి నెలకోసారి టూరిస్ట్ లాగా వచ్చి వ్యక్తిగత విమర్శలు చేస్తా ఉంటే ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. రోజుకు 18 గంటలు పని చేస్తున్న నాయకుని విమర్శించడం సరికదన్నారు. 10 సంవత్సరాల పాలనలో నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు పెండింగ్లో ఉన్నాయని, సాగునీటి రంగంపై, రైతాంగ సమస్యలపై ఎమ్మెల్యే పవర్ రామరావ్ పటేల్ అసెంబ్లీలో మాట్లాడింది మీకు కనిపించలేదా అని ప్రశ్నించారు. మాపై ఒకవేళ చూస్తే మీకు ఐదు వేళ్ళతో సమాధానం చెబుతామన్నారు. బిజెపి కాంగ్రెస్ ఒకటేనని మాట్లాడడం సరికాదని ఇకనైనా తీరు మార్చుకోవాలన్నారు. అవగాహన లేని మాటలు మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీకి చెడ్డ పేరు తే వద్దన్నారు. బిజెపి గెలుపును ఓర్వలేకనే బి ఆర్ఎస్ పసలేని ఆరోపణలు చేస్తుందన్నారు. సిరాల ప్రాజెక్టు కట్ట తెగి రైతులు నష్టపోతే అప్పటి మీ ప్రభుత్వం ఏం చేసిందన్నారు. ఈసారి రైతుల సమస్యలపై ప్రభుత్వంతో మాట్లాడి జొన్న, పత్తి, సోయా, కొనుగోళ్ల పరిమితిని పెంచేటట్లు చేసిన ఘనత ఎమ్మెల్యే పవర్ రామరావ్ పటేల్ దేనన్నారు.ఇంకొకరిని విమర్శించేముందు ఆత్మ విమర్శ చేసుకొని మాట్లాడాలన్నారు. చుట్టపు చూపుగా వచ్చి ఆర్భాటాల కోసం ఎమ్మెల్యే పై విమర్శలు చేయవద్దన్నారు.మరో మారు విమర్శలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.సమావేశం లో నాయకులు బండారి అశోక్, గాలిరాజు, నారాయణ, దిలీప్, కాసరోళ్ల ప్రవీణ్, సత్యనారాయణ రెడ్డి, బాలాజీ పటేల్, నాగన్న, గంగా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








