నసురుల్లాబాద్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలోని రామాలయం ఆవరణలో శనివారం రోజు భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులుగా రెండు దఫాలు పనిచేసి జిల్లా నాయకుడిగా ఎదిగిన సున్నం సాయిలు ను మండల నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఘనంగా శాలువాలతో సత్కరించారు . ఈ క్రమంలో వారు ఒకరికొకరు మిఠాయిలు పంచిపెట్టుకొని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సున్నం సాయిలు మాట్లాడుతూ తనను మండల అధ్యక్షుడిగా నియమించిన నాటి నుండి మండల పరిధిలోని అన్ని గ్రామాలకు చెందిన సీనియర్ నాయకులు కార్యకర్తలు అందరూ ఎల్లవేళలా తనకు అన్ని విధాలుగా సహకరించి పార్టీ బలోపేతానికి కృషి చేసినందుకుగాను ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో ఇదేవిధంగా అందరినీ కలుపుకొని వారి సహకారంతో రెట్టింపు ఉత్సాహంతో క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా పనిచేస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి మేకల రాములు మాట్లాడుతూ సున్నం సాయిలు భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కొరకు చేసిన సేవలను ఎప్పటికీ మర్చిపోలేము అని అన్నారు. నసురుల్లాబాద్ మండలంలో భారతీయ జనతా పార్టీ ఒక్క బూత్ కమిటీ కూడా లేని పరిస్థితులలో ప్రతి గ్రామానికి వెళ్లి కార్యకర్తలను చైతన్యపరిచి కమిటీలు వేసి మండల వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీని అభివృద్ధి చేశారని కొనియాడారు. గతంలో మండల వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ప్రాబల్యం మెరుగ్గా ఉండేది కాదని పేర్కొన్నారు. అలాంటిసమయంలో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సున్నం సాయిలు అహర్నిశలు పనిచేస్తూ జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకుల దృష్టిని ఆకర్షించి జిల్లా నాయకుడిగా ఎదగడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు.

భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మేకల రాములు, ఉపాధ్యక్షుడు అనుసూరి శ్రీనివాస్, కిసాన్ మోర్చా అధ్యక్షులు గొడిసెల యాదగిరి గౌడ్, యువ మోర్చా అధ్యక్షులు మహేష్, దుర్గం సంజీవ్, అరిగె నారాయణ, భూత్ అధ్యక్షులు ఉల్లెంగ గోపి, కంది పెద్ద మల్లేష్, పవన్, రాజు, సాయన్న, కొప్పుల సాయిలు, ఉల్లెంగ పర్వయ్య , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








