V1News Telangana

best news portal development company in india

ఇసుక మాఫియా వెలిగించిందే.. పాత్రికేయులపై దాడి ఘోరం!.. దిష్టిబొమ్మలు కాల్చడం హేయ చర్య – పత్రికా స్వేచ్ఛపై దాడి! ఇసుక మాఫియా ఎక్స్‌పోజ్ చేసిన జర్నలిస్టులపై దుష్ప్రచారం – బీజేపీ, బిఆర్ఎస్ ఖండన.. . మీడియా మిత్రులకు అండగా ఉంటాం – బీజేపీ, బిఆర్ఎస్

SHARE:

బోధన్ నియోజకవర్గంలో ఇసుక మాఫియాపై నిజాలు వెలికితీస్తున్న పత్రికా సోదరులపై దిష్టిబొమ్మలు దహనం చేయడం, కాలితో తన్నడం వంటి చర్యలు తీవ్ర కలవరానికి కారణమయ్యాయి.

ఈ ఘటనపై భారతీయ జనతా పార్టీ మరియు భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీలు తీవ్ర స్థాయిలో స్పందించాయి.

బీజేపీ జిల్లా కార్యదర్శి సుధాకర్ చారి, పట్టణ అధ్యక్షులు గోపి కిషన్, ఇతర మండల అధ్యక్షులు మాట్లాడుతూ –ఇసుక మాఫియా అక్రమాలను వెలికితీసే పాత్రికేయులపై దుష్ప్రచారం హేయమైన చర్య. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీడియా సోదరులకు మేము సంపూర్ణ అండగా నిలుస్తాం.”

అలాగే, ఈ రోజు బోధన్‌లో బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించి,
“ఖండ్గావ్, సిద్ధాపూర్ ప్రాంతాల్లో ఇసుక మాఫియా కార్యకలాపాలపై సత్యాన్ని ప్రజలకు చూపించిన పాత్రికేయులపై అసభ్యకరంగా ప్రవర్తించడం అభ్యంతరకరం. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి మచ్చతెచ్చే విధంగా ఉన్నాయి. మీడియా మిత్రులకు మేము అండగా ఉన్నాం,” అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు:
మహమ్మద్ రజాక్, బెంజర్ గంగారం, రేఖందాసు, ప్రవీణ్ జాదవ్, షేక్ జాకీర్ అహ్మద్, సాగర్, షేక్ మొహమ్మద్ తదితరులు.అంతేకాకుండా, స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తక్షణమే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రెండు పార్టీలు డిమాండ్ చేశాయి.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india