V1News Telangana

best news portal development company in india

ఆన్‌లైన్ గేమ్స్ మాయలో యువకుడి బలి! . డిజిటల్ వ్యసనం ప్రాణం తీసింది – . ఆన్‌లైన్ గేమ్స్ ఉక్కిరిబిక్కిరి చేసిన యువజీవితం…. ఐదు వేల రూపాయల ఆశ.. ప్రాణం తీసింది!… క్రీడ కాదు.. కబేళా! ఆన్‌లైన్ గేమ్ బారిన యువకుడు

SHARE:

రుద్రూర్, మే 14 (V1 న్యూస్):
ఆన్‌లైన్ గేమ్స్‌ మాయలో ఒక యువజీవితం విలీనం అయింది. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం రాయకూర్ గ్రామానికి చెందిన మాగిరి గంగాధర్ (20) ఆన్‌లైన్ గేమ్స్ బానిసగా మారి చివరికి జీవితం కోల్పోయాడు. వ్యవసాయ కూలి కుటుంబానికి చెందిన గంగాధర్, కొంతకాలంగా డిజిటల్ గేమ్స్ మత్తులో చిక్కుకుని లక్ష్యాన్ని కోల్పోయాడు. ఐదు వేల రూపాయలు తన తండ్రి ఫోన్ నుంచే ట్రాన్స్‌ఫర్‌ చేసి గేమ్స్‌లో పెట్టుబడి పెట్టాడు. ఆశించిన విజయాన్ని సాధించలేక డబ్బులు కోల్పోయిన గంగాధర్ తీవ్ర మనోవేదనకు గురై మంగళవారం రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

విషయంపై గంగాధర్ తండ్రి మాగిరి పోశెట్టి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రుద్రూర్ ఎస్సై పి.సాయన్న కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు తెలిపారు.
ఈ ఘటన యువతలో ఆన్‌లైన్ గేమ్స్ పై పెరిగిన వ్యసనాన్ని, దాని ప్రమాదాలను మళ్లీ ఒకసారి ముందుకు తెచ్చింది.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india