V1News Telangana

best news portal development company in india

వాలపాడు గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం అవకతవకలు – రైతుల బోనాలు

SHARE:

నిర్మల్ జిల్లా బైంసా మండలం వాలపాడు గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మైసూర్ పేరిట కొత్త విధానాన్ని మిల్లర్లు అమలు చేస్తూ, వడ్ల బస్తా తూగునప్పుడు ఏడు నుండి ఏడున్నర కిలోల మేరకు తక్కువగా తూకం వేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రైతులకు నష్టాన్ని కలిగించే ఈ చర్యలను వెంటనే ఆపాలని ముధోల్ నియోజకవర్గం ఉద్యమ నాయకుడు, టీఆర్ఎస్ సామాన్య కార్యకర్త విలాస్ గాదివర్ డిమాండ్ చేశారు.

అదే విధంగా, లారీలు మరియు హామాలులో ఉన్న అవ్యవస్థల వల్ల రైతులు ఎక్కువ కష్టాలు పడుతున్నారని కూడా ఆయన అన్నారు. ప్రభుత్వం దీనిపై తక్షణమే స్పందించి, వడ్ల కొనుగోలు కేంద్రాల్లో జరిగే అక్రమాలను నిరోధించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో నిమ్మ సురేష్, రాజు, సుభాష్, జనార్దన్ సార్, అమీర్ తదితర టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india