V1News Telangana

best news portal development company in india

మహిళల భద్రతే షీటీం లక్ష్యం – ఫుడ్ అండ్ సైన్స్ కళాశాలలో అవగాహన కార్యక్రమం

SHARE:

రుద్రూర్, v1 న్యూస్, రాజశేఖర్:రుద్రూర్ మండల కేంద్రంలోని ఫుడ్ అండ్ సైన్స్ కళాశాలలో మహిళా భద్రతను దృష్టిలో పెట్టుకుని షీటీం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినీలకు వివిధ సమస్యలపై సమగ్ర అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా షీటీం బృందం మాట్లాడుతూ, “పోకిరీలు అసభ్యంగా ప్రవర్తించడం, మార్ఫింగ్ ఫొటోలు/వీడియోలతో బెదిరించడం వంటి సందర్భాల్లో బాధితులు నిర్భయంగా షీటీంను సంప్రదించాలి. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి” అని తెలిపారు. షీటీం ఫిర్యాదు నెంబర్లు: 94906 16555, 94408 14550 అని పేర్కొన్నారు.

అదేవిధంగా ఒంటరిగా ప్రయాణించే మహిళల భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘టీ-సేఫ్’ యాప్ (T-Safe App) వినియోగంపై కూడా సమాచారం అందించారు. ఇది ప్రతి మహిళ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండాలని సూచించారు.

ఇంకా, మైనర్ బాలికల వివాహాలు జరగడాన్ని గుర్తించి చైల్డ్ హెల్ప్‌లైన్ 1098, లేదా డయల్ 100 కు సమాచారం ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈవ్-టీసింగ్, మహిళలపై నేరాలు, గుడ్ టచ్ – బ్యాడ్ టచ్, మూఢనమ్మకాలు, బాల్యవివాహాల వంటి అంశాలపై విద్యార్థినీలకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో షీటీం సభ్యులు పీసీ విజయ్ కుమారి, డబ్ల్యూపీసీ సునయన, రుద్రూర్ ఎస్సై పి.సాయన్న, ఏఎస్‌ఐ రాజు, ఇతర పోలీసు సిబ్బంది, కళాశాల విద్యార్థినీలు పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india