బోధన్, మే 12: బోధన్ పట్టణ ఎంఐఎం శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. తాజాగా ఎన్నికైన పట్టణ అధ్యక్షుడు మీర్ ఇలియాస్ అలీ బోధన్ రాజకీయ దిశను మార్చే ప్రకటనతో ముందుకు వచ్చారు. రాబోయే మే 13న, రాకాసిపేట్ మహర్బా ఫంక్షన్ హాల్లో నిర్వహించబోయే నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరగనున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమానికి ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫయాజ్ అహ్మద్ ముఖ్య అతిథిగా విచ్చేయనుండగా, పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ, మలక్పేట్ ఎమ్మెల్యే బాలాల ల ఆదేశాల మేరకు వేడుకలు జరుగుతాయని తెలిపారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని వేడుకను విజయవంతం చేయాలని ఉద్ఘాటించారు.
ఇలియాస్ అలీ తన స్వగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించి, కార్యక్రమానంతరం జలాల్ బుఖారి దర్గాలో చాదర్ సమర్పణ జరిగి, తరువాత భోజన సదుపాయం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. సమావేశంలో అహమ్మద్ బిన్ మోసిన్, హబీబ్ ఖాన్, ఖదీర్, అబ్దుల్ అల్తాఫ్, సమీర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








