V1News Telangana

best news portal development company in india

న్యాయ విచారణలో ఉన్న వెంచర్‌పై రిజిస్ట్రేషన్లు ఎందుకు?– అధికారులపై బీజేపీ నేత బాలాజీ ఆవేదన

SHARE:

నిర్మల్ జిల్లా తానుర్ మండలం బెల్ తోరోడ గ్రామంలోని సర్వే నంబర్లు 38, 39, 40లో స్థలాలపై గతంలో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్లను రెగ్యులరైజ్ చేయమని ఒత్తిడి రావడంతో, అప్పటి ఇన్‌ఛార్జి సబ్ రిజిస్ట్రార్ తిరస్కరించినట్లు సమాచారం. తాజా సబ్ రిజిస్ట్రార్ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన మేడం ఆయా రిజిస్ట్రేషన్లను రిజెక్ట్ చేయడంతో వెంచర్ యజమానులు హైకోర్టును ఆశ్రయించారు.

కేసు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నప్పటికీ, ఇటీవల కొన్ని ప్లాట్లను సబ్ రిజిస్ట్రార్ రిజిస్టర్ చేయడం న్యాయపరంగా మరియు పరిపాలనా పరంగా తగదని బీజేపీ నేత బాలాజీ సూత్రావే అభిప్రాయపడ్డారు. కేసులో పార్టీగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ ఈ రిజిస్ట్రేషన్లు చేయడం తగదని ఆయన విమర్శించారు.

డిటిసిపి అప్రూవల్ లేకుండా రిజిస్ట్రేషన్లు జరగడం, అదే సమయంలో కోర్టులో రిట్ పిటిషన్ వేయడం దారుణమని పేర్కొంటూ, అధికారులు, వెంచర్ యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వ్యవహారంపై కలెక్టర్, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్‌లకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. న్యాయ విచారణ పూర్తయ్యే వరకు ఎటువంటి రిజిస్ట్రేషన్లను అంగీకరించరాదని ఆయన హెచ్చరించారు.

– బాలాజీ సూత్రావే,
మాజీ పట్టణ అధ్యక్షుడు, బీజేపీ, బైంసా

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india