V1News Telangana

best news portal development company in india

నిర్మల్ జిల్లా. మహీషా పట్టణ సమస్యలపై వినతిపత్రం సమర్పణ… . డిప్యూటీ కలెక్టర్‌ను కలిసిన మహీషా పట్టణ కమిటీ సభ్యులు…. . ప్రజా సమస్యలపై అధికారులను కలిసి చర్యల కోసం డిమాండ్…. . పట్టణ అభివృద్ధికి కమిటీ ప్రతినిధుల వినతి….

SHARE:

నిర్మల్ జిల్లా.మహీషా, మే 7:
నిర్మల్ జిల్లా. మహీషా పట్టణంలో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారానికి గాను, పట్టణ కమిటి ఆధ్వర్యంలో డిప్యూటీ కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు యనుపోతుల మల్లేష్ గారు, మాజీ కౌన్సిలర్ రావుల పోషేట్టి గారు, సహేబ్ రావ్, కపిల్, సినియర్ నాయకులు గాలి రాజన్న గారు, పట్టణ అధ్యక్షులు రావుల రాము, కాసరోల్ల ప్రవీణ్, బండారి దిలిప్, ముళ్ళవార్ అనిల్, బొల్చెట్టి రాజు, సందుల శంకర్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

వినతిపత్రంలో పట్టణంలోని తాగునీటి సమస్యలు, రోడ్ల దుస్థితి, మురుగు సమస్యలు, మరియు ప్రజలకు ఎదురవుతున్న ఇతర సమస్యలపై వివరించి, తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. డిప్యూటీ కలెక్టర్ గారు వినతిపత్రాన్ని స్వీకరించి, సంబంధిత అధికారులతో చర్చించి త్వరితగతిన పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india