నిజామాబాద్ జిల్లా సాలుర మండలంలో “కల్తీ కళ్ళు వద్దు – మంచి జీవితమే ముద్దు!” అనే నినాదంతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ యాంటి నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహించారు.
సదస్సులో అధికారులు మత్తు పదార్థాల వలన వ్యక్తిగత, సామాజికంగా కలిగే హానికర పరిణామాలపై వివరణ ఇచ్చారు. ప్రజల భాగస్వామ్యంతోనే డ్రగ్స్ నిర్మూలన సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. “చేయి చేయి కలుపుదాం – డ్రగ్స్ రహిత తెలంగాణ నిర్మిద్దాం” అని వారు పిలుపునిచ్చారు.
సదస్సుకు హాజరైన ఏసీపీ సోమేశ్వర్ గారు మాట్లాడుతూ, “గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులే గాక, వారి కార్యకలాపాలపై కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎటువంటి అనుమానాస్పద సమాచారం అయినా వెంటనే 1908 టోల్‌ఫ్రీ నంబరుకు తెలియజేయాలి,” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్సై మచ్చేందర్ రెడ్డి, ఎస్ఎస్ చైర్మన్ Alle జనార్ధన్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








