Post Views: 186
నిజామాబాద్, సాలుర మండలం:తెలంగాణ యాంటి నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో సాలుర మండలంలో మాదకద్రవ్యాలపై అవగాహన సదస్సు నిర్వహించబడింది. ఈ కార్యక్రమం ద్వారా మాదకద్రవ్యాల వినియోగం యొక్క దుష్ఫలితాలు, సమాజంపై ప్రభావం, మరియు యువత భవిష్యత్తుపై అవి కలిగించే హానిని వివరించారు.
ప్రజల సహకారంతో డ్రగ్స్ నిర్మూలన సాధ్యమవుతుందని అధికారులు పేర్కొన్నారు. “చేయి చేయి కలుపుదాం – డ్రగ్స్ రహిత తెలంగాణ సాదిద్దాం” అనే నినాదంతో ముందుకుసాగుతున్న ఈ ప్రచారం, ప్రతీ పౌరుడి భాగస్వామ్యాన్ని కోరుతోంది.
డ్రగ్స్‌కు సంబంధించిన ఏవైనా సమాచారం ఉన్నట్లయితే, ప్రజలు వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1908 కు కాల్ చేయాలని సూచించారు. ఇది పూర్తిగా గోప్యంగా నిలుపబడుతుందని స్పష్టం చేశారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








