V1News Telangana

best news portal development company in india

పరీక్ష రాసి వస్తుండగా ఘోర ప్రమాదం: అక్కాచెల్లెళ్ల దుర్మరణం తండ్రి మలేషియాలో చిక్కుకుపోయి కూతుళ్ల చివరి చూపుకూ నోచుకోలేకపోయాడు

SHARE:

నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని లోతర్య తండాకు చెందిన బాణావత్ సుగుణ, రెడ్డి నాయక్‌ల కూతుళ్లు అశ్విని (19), మంజుల (17) హైదరాబాద్‌లో ప్రవేశ పరీక్ష రాసేందుకు వెళ్లారు. పరీక్ష ముగించుకొని ఇంటికి తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు కల్వర్టును ఢీకొట్టింది. ఈ ఘోర రోడ్డుప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

మూడేళ్ల క్రితం జీవనోపాధి కోసం మలేషియాకు వెళ్లిన తండ్రి రెడ్డి నాయక్, అక్కడ కంపెనీ మోసానికి గురై కూలీ పనులు చేస్తూ జీవితాన్ని సాగిస్తున్నారు. కూతుళ్ల మరణవార్త విన్న ఆయన కన్నీళ్లతో దేశానికి రావాలనుకున్నప్పటికీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా తిరిగి రావలేకపోయారు.

ఈ విషయాన్ని తెలిసిన కేటీఆర్, రెడ్డి నాయక్‌తో ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. కూతుళ్లను చివరిసారిగా చూసేందుకు సహాయంగా ఉండేలా ఆయన టీమ్ ద్వారా స్వదేశానికి తీసుకొచ్చే ఏర్పాట్లు ప్రారంభించారు.

ఇక కుటుంబాన్ని పరామర్శించేందుకు ఖానాపూర్ బీఆర్ఎస్ ఇంచార్జ్ జాన్సన్ నాయక్ స్వయంగా వచ్చి, అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india