V1News Telangana

best news portal development company in india

కిసాన్ సేవ సమితి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం – BRS నేత డా. కిరణ్ కొమ్రేవార్ ఘన సత్కారం

SHARE:

భైంసా పట్టణంలోని కిసాన్ గల్లీకి చెందిన కిసాన్ సేవ సమితి సభ్యుల ఆహ్వానంపై, ముధోల్ నియోజకవర్గానికి చెందిన BRS పార్టీ నేత డా. కిరణ్ కొమ్రేవార్ గారు తన సతీమణితో కలిసి ఈరోజు ఉదయం 11 గంటలకు కార్యక్రమానికి హాజరయ్యారు. వారిని సమితి అధ్యక్షులు మరియు సభ్యులు ఘనంగా శాలువాతో సత్కరించి, అభినందనలు తెలియజేశారు.

సమాజానికి అంకితభావంతో సేవలందిస్తున్న కిసాన్ సేవ సమితి అధ్యక్షులూ, సభ్యులూ కూడా ప్రత్యేకంగా శాలువాతో సత్కారం పొందారు. ఈ సందర్భంగా సమాజంలో ప్రతి ఒక్కరు సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని, మరిన్ని సేవా కార్యక్రమాల ద్వారా స్ఫూర్తిగా మారాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో BRS పార్టీ భైంసా పట్టణ యువ నాయకులు రావుల పోశెట్టి, పురంశెట్టి రవి, తెలంగాణ ఉద్యమ కార్యకర్త రావుల వనిత – పోశెట్టి గారు పాల్గొనడం జరిగింది.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india