నసురుల్లాబాద్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా : నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో గురువారం రోజు బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు గొడిసెల నర్సింలు గౌడ్ ఆధ్వర్యంలో కార్యకర్తలతో కలిసి సమావేశం ఏర్పాటు చేసి ప్రెస్ నోట్ విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుధవారం రోజు రవీంద్రభారతిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి పరుష పదజాలంతో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ విమర్శించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.శాసనసభ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచిన ఆచరణ సాధ్యం కానీ హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు పరచడంలో పూర్తిస్థాయిలో వైఫల్యం చెంది..వాటిని పక్కన పెట్టి ప్రజల దృష్టి మళ్లించడానికి నోటికి వచ్చినట్టు మాట్లాడటంపై మండిపడ్డారు. దేవుళ్లపై ఒట్లు వేస్తూ కాలయాపన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమ సమయంలో నీ పాత్ర ఏంటి..తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు14 సంవత్సరాలు అలుపెరుగని పోరాటం చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన నాయకుడిని ,10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా దేశంలో తెలంగాణను నెంబర్ వన్ రాష్ట్రంగా అభివృద్ధి పరిచి అద్భుతమైన పరిపాలన అందించిన నాయకున్ని ఉద్దేశించి కించపరిచినట్లు నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మీకు ప్రజల అభివృద్ధి పట్ల నిజమైన చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసి తమ పరిపాలన దక్షతను నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన పట్ల విసుగు చెందుతున్నారని.. రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజలు ఓటు అనే ఆయుధంతో తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో గొడిసెల నరసింహులు గౌడ్ ,యం.డి. అఫ్రోజ్, టేకుర్ల సాయిలు, ch.లక్ష్మణ్ రాథోడ్, రాజు నాయక్, డి.సాయిలు, లక్ష్మణ్ ,వీరేందర్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








