V1News Telangana

best news portal development company in india

భైంసాలో గంజాయి విక్రేత అరెస్ట్ — 1.14 కేజీ గంజాయి స్వాధీనం

SHARE:

ఈ రోజు, 29.04.2025 న, మధ్యాహ్నం సుమారు 2 గంటల ప్రాంతంలో భైంసా టౌన్ లో పోలీస్ మరియు రెవెన్యూ అధికారుల సంయుక్త దాడిలో నిషేధిత గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని పట్టుకున్నారు. భైంసా టౌన్ ఎస్‌ఐ శ్రీ కె. గణేష్ మరియు సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ అహ్మద్, కానిస్టేబుళ్లు ప్రమోద్, శరత్, హరిబాబు, బాలాజీ, రెవెన్యూ సిబ్బంది మరియు నిర్మల్ జిల్లా క్లూస్ టీం సభ్యులు ఈ దాడిలో పాల్గొన్నారు.

పట్టుబడిన వ్యక్తి పేరు ముజామ్మిల్ హుస్సేన్ (33), వృత్తి: ప్రైవేట్ ఉద్యోగి, నివాసం: ఒవైసీనగర్, భైంసా టౌన్. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పవార్ వాడి, మలేగామ్, నాసిక్ జిల్లా, మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన ముజామ్మిల్ హుస్సేన్ తెల్లటి కవర్ లో గంజాయి పట్టుకొని పోలీసు వాహనాలను గమనించి పరారయ్యే ప్రయత్నం చేశాడు.
పోలీసులు అతన్ని వెంటాడి పట్టుకొని అతని వద్ద నుంచి సుమారు 1 కిలో 140 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనపరచుకున్నారు. అనంతరం ముజామ్మిల్ హుస్సేన్‌ను న్యాయపరమైన రిమాండుకు తరలించారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు సమాచారం.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india