కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం మంజీరా సరిహద్దుల్లో మళ్లీ పేకాట జోరు పెరిగిపోయింది. మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతున్న ఈ దందా వెనుక రాజకీయ నాయకుల మద్దతా? అధికారుల మాయహస్తమా? అనే అనుమానాలు ఊపందుకున్నాయి.
రహస్య ప్రదేశాల్లో లక్షల రూపాయల పేకాట గేములు జోరుగా సాగుతున్నాయి. పేకాట స్థావరాల్లో మందు, విందు, మద్యం మత్తులో ఆటగాళ్లు చిత్తవుతున్నారు. డబ్బు లేకుంటే వడ్డీకి ఇచ్చి, వారిని జీవితాంతం బానిసలుగా మలుచుకుంటున్న ముఠా గజగజలాడుతోంది.
ఈ దందాకు బీర్కూర్ నసర్లబాద్. స్థానికులైనటువంటి వ్యక్తులు. నాయకత్వం వహిస్తున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. “మాకు ఎవరూ ఏమీ చేయలేరు, మేము అందరికి మామూలు పెడుతున్నాం,” అంటూ రెచ్చిపోతూ ప్రకటనలు చేస్తున్నారు. ఇది చూస్తుంటే, పోలీసుల సైతం వీరి ముందు చేతులెత్తినట్టు ప్రజల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బాన్సువాడ, కామారెడ్డి. వర్ని, నసర్లాబాద్. రుద్రూర్. పోతంగల్. బోధన్. నిజామాబాద్. చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ఆటగాళ్లు బీర్కూర్‌కు చేరుకుంటూ పేకాట పండుగ మోస్తున్నారు. దీనివల్ల ఎన్నో కుటుంబాలు అప్పులు, బాధల్లో కూరుకుపోతున్నాయి. జీవితం నాశనం అవుతున్నది.
బాధితులు గళమెత్తి — “ఇప్పటికైనా పై అధికారులు మేలుకోండి! పేకాట ముఠాపై బలమైన చర్యలు తీసుకోండి!” అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే పేకాట భూతం నిన్నటికంటే రెట్టింపు వేగంతో ఊగిపోతున్నదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








