V1News Telangana

best news portal development company in india

బోధన్‌లో డంపింగ్ యార్డ్ పరిశీలనలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి… . మున్సిపల్ వెహికల్స్‌ను తనిఖీ చేసిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి…. . బోధన్ పట్టణం అభివృద్ధి లక్ష్యంగా ఎమ్మెల్యే నిఖిల పరిశీలన…. . వెనుకబడిన ప్రాంతాల పరిశీలనలో భాగంగా డంపింగ్ స్థలాన్ని సందర్శించిన ఎమ్మెల్యే… ప్రజల ఆరోగ్య భద్రత కోసం చర్యలు తీసుకుంటున్న సుదర్శన్ రెడ్డి …

SHARE:

బోధన్, ఏప్రిల్ 29:

బోధన్ పట్టణ అభివృద్ధి పథకాల్లో భాగంగా, స్థానిక ఎమ్మెల్యే శ్రీ సుదర్శన్ రెడ్డి గారు డంపింగ్ యార్డ్‌ను సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. మున్సిపాలిటీకి చెందిన వ్యర్థాలను తరలించే వెహికల్స్ (బండ్లు) స్థితిగతులను కూడా ఆయన ప్రత్యేకంగా తనిఖీ చేశారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “పట్టణ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం ప్రభుత్వ ప్రధాన బాధ్యత. వ్యర్థ నిర్వహణపై మరింత శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది,” అని పేర్కొన్నారు.

డంపింగ్ యార్డ్‌లో పరిసరాలను పరిశీలించిన అనంతరం, మున్సిపల్ సిబ్బందిని అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వచ్చే రోజులలో బోధన్ పట్టణాన్ని మరింత పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు.

పరిశీలనలో మున్సిపల్ కమిషనర్, కార్యదర్శి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india