సాలూర (నిజామాబాద్ జిల్లా), ఏప్రిల్ 28:
సాలూరమండలం, తగ్గేల్లి గ్రామ శివారులో జరిగిన అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. మంటలు అకస్మాత్తుగా చెలరేగి, సుమారు ఐదు ఎకరాల పొలంలో నాటి ఉన్న ఈత చెట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.
స్థానికులు మంటలు గమనించి వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే ఈత చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి.
ఈ ప్రమాదంలో సుమారు రూ.2 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని, తమ కుటుంబం జీవనాధారమైన ఈత చెట్ల నాశనంతో తీవ్రంగా ఆర్థికంగా నష్టపోయామని బాధిత ఈత కార్మికుడు మల్లెపూల లక్ష్మణ్ కన్నీటి గట్టుతో పేర్కొన్నారు. బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే, సబ్ కలెక్టర్ స్పందించి తమకు ఆర్థిక సాయం అందించాలని ఆయన మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు.
గ్రామస్తులు కూడా బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని, ప్రభుత్వం నుంచి తగిన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
అధికారులు త్వరితగతిన స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు….
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








