నసురుల్లాబాద్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: బిఆర్ఎస్ పార్టీ నసురుల్లాబాద్ మండల నాయకులు శనివారం రోజు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల నాయకులు గొడిసెల నరసింహులు గౌడ్ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు
ఈ నెల 27 న ఆదివారం రోజు వరంగల్ జిల్లా
ఎల్కతుర్తి లో నిర్వహించే భారీ బహిరంగ సభకు భారీ సంఖ్యలో హాజరుకావాలని..బిఆర్ఎస్ పార్టీ స్థాపించి 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవ వేడుకలలో కెసిఆర్ ప్రసంగం, సాంస్కృతిక కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరగబోతున్నాయని తెలిపారు. ఈ భారీ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు నర్సింలు గౌడ్, యండి .అప్రోజ్ ,టేకుర్ల సాయిలు ,కురుమ గంగారాం, మాడ లక్ష్మణ్, శంకర్, లక్ష్మణ్, సాయిలు, కీసరి అంజయ్య, డి.సాయిలు, తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








