V1News Telangana

best news portal development company in india

పవాల్ గావ్ ఉగ్రదాడిని ఖండిస్తూ హిందూ సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున కొవ్వొత్తుల ర్యాలీ, దిష్టిబొమ్మ దగ్ధం…..

SHARE:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో గురువారం రోజు రాజకీయాలకు అతీతంగా హిందూ సంఘాల ఆధ్వర్యంలో బుధవారం రోజు పవాల్ గావ్ లో హిందువులపై జరిగిన ఉగ్ర దాడిని ఖండిస్తూ బిజెపి నసురుల్లాబాద్ మండల అధ్యక్షులు సున్నం సాయిలు ఆధ్వర్యంలో స్థానిక రామాలయం నుండి ప్రయాణ ప్రాంగణం వరకు కొవ్వొత్తులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సున్నం సాయిలు మాట్లాడుతూ హిందువులపై ఉగ్రవాదులు దాడులు జరపడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రవాదులు పర్యాటక ప్రదేశంలో ఉన్న వారిని ప్యాంట్లు విప్పి హిందువులని నిర్ధారించుకొని నిర్ధాక్షిణ్యంగా కాల్పులు జరపడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. హనీమూన్ కు వెళ్లిన జంటలపై కూడా కాల్పులు జరిపి చంపిన తర్వాత ఆడబిడ్డకు హెచ్చరికలు జారీ చేయడంతో భర్త మృతదేహం పక్కన బిక్కుబిక్కుమంటూ కూర్చున్న సంఘటన చూసి గుండె చలించి పోయిందని అన్నారు. ఆనాడు పుల్వామా సంఘటన, బంగ్లాదేశ్ లో హిందూ దేవాలయాలపై మరియు హిందూ ప్రజలపై జరిగిన దాడులు భారతావని పై జరిగిన దాడిలో అభివర్ణించారు. ప్రపంచ దేశాలు శాంతిని కోరుకుంటున్నాయని .. దేశ నాయకులు సైతం శాంతిభద్రతల పరిరక్షణ, దేశ ప్రజల యోగక్షేమాలను దృష్టిలో ఉంచుకొని పరిపాలన కొనసాగిస్తున్నారని అన్నారు. ఒక్కసారి సహనం కోల్పోయి ఎదురుదాడి జరిపితే ప్రపంచ పటంలో ఉగ్రవాద దేశాలు మట్టి కరిచిపోతాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మేకల రాములు, అనుసూరి శ్రీనివాస్, జనపల సాయిలు, పెర్క రాములు,రాఘవ, గొడిసెల నర్సింలు గౌడ్, టేకుర్ల సాయిలు, జగన్, గంగాధర్ గుప్తా,మంగళి సాయికుమార్, నాయకులు,కార్యకర్తలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india