V1News Telangana

best news portal development company in india

బోధన్ లో మట్కా మాఫియా అడ్డా – పోలీస్ స్టేషన్ దరిదాపుల్లోనే మాయాజాలం! . రోజూ పదివేలు పైగా సంపాదన – మట్కా నిర్వాహకుల రచ్చ బోధన్ ను వదలడం లేదు! . పోలీసులకు మామూలు.. మట్కా గేమ్ కి ప్రాణాలు ఇచ్చే పేదలు! . బోధన్ ప్రజల విన్నపం – మట్కా దందాపై కఠిన చర్యలు తీసుకోండి! . వాట్సాప్ లోనూ మట్కా! – బోధన్ పట్టణం ఆన్లైన్ మాయలో చిక్కుకుంది….

SHARE:

బోధన్ లో మట్కా మాయాజాలం: పేద ప్రజల జీవితాలతో చెలగాటం..

బోధన్: పట్టణంలోని ప్రధాన ప్రాంతాల్లో, పోలీస్ స్టేషన్ సమీపంలోనే, రోజూ పదివేలకు పైగా ఆదాయం సాధిస్తూ మట్కా నిర్వాహకులు మాయాజాలాన్ని నడుపుతున్నారు. రెంజల్ బేస్, వెజిటేబుల్ మార్కెట్, శక్కర్ నగర్, బీటి నగర్ వంటి ప్రాంతాలు మట్కా కేంద్రాలుగా మారాయి. టీ స్టాల్స్, వీక్లీ మార్కెట్ల పక్కన ఈ గేమ్‌లు నిర్భయంగా సాగుతున్నాయి.

ఈ మాయ గేమ్‌లో నంబర్లు గెస్ చేసి గెలిచినవారికి పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తామంటూ నిరుపేదలను ఆశలో పడేస్తున్నారు. వాస్తవంగా మాత్రం ఓడిపోయే ప్రజలు తమ ఇంటి ఆభరణాలు, వాహనాలు తాకట్టు పెట్టి అప్పుల్లో పడిపోతున్నారు. మట్కా నిర్వాహకులు మాత్రం గెలుపు ఓటమిలా ఏమీ లేనట్లుగా కేవలం కమిషన్ మీద కోట్ల వ్యాపారం చేస్తున్నారు.

వాట్సాప్ వేదికగా ఆన్లైన్ గేమ్‌లు నిర్వహిస్తూ డిజిటల్ రూపంలో ఈ దందా విస్తరిస్తోంది. అధికారుల కంటికి ఇది కనిపించడం లేదని, లేదంటే వారు ముడుపులు తీసుకుని నిశ్శబ్దంగా ఉన్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

స్థానిక ప్రజలు సంబంధిత శాఖలపై నమ్మకంతో, బోధన్ లో జరుగుతున్న ఈ మాయ గేమ్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india