సాలురా మండల గర్వంగా నిలిచిన నాయకుడు – బుద్దే రాజేశ్వర్ గారి విగ్రహ ప్రతిష్టాపన…
నిజామాబాద్ జిల్లా, సాలురా మండలం: ప్రజల సంక్షేమమే ధ్యేయంగా జీవించిన నాయకుడు బుద్దే రాజేశ్వర్ గారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం 2025 ఏప్రిల్ 23న సాలురా మండలంలోని బైపాస్ రోడ్డులోని హనుమాన్ మందిరం మార్గంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండల అధికారులు ప్రజాప్రతినిధులు. నాయకులు. మండల ప్రజలు తదితర ప్రముఖులు హాజరై ఆయన సేవలకు ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా, ప్రముఖులంతా బుద్దే రాజేశ్వర్ గారి సేవలను ప్రశంసిస్తూ, “రాజేశ్వర్ గారి సేవలు రాజకీయాలకు అతీతంగా, మానవతా విలువలకు అద్దంపడేలా సాగినవని” చెప్పారు. సాలురా గ్రామానికి సమగ్ర అభివృద్ధి తీసుకొచ్చిన ఆయన, ప్రజల మధ్యలో ఉండి, వారి అవసరాలు, సమస్యల పట్ల అనుగుణంగా స్పందించేవారు.
బుద్దే రాజేశ్వర్ గారు ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించి, చిన్ననాటి నుంచే ప్రజల పట్ల మమకారంతో ఎదిగారు. ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన రోజుల్లో తెలంగాణ రాష్ట్రం ఇంకా ఏర్పడలేదు. టీడీపీలో చేరి, సర్వసాధారణ ప్రజల ఆశీర్వాదాన్ని సంపాదించిన ఆయన, బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి)లో చేరి తెలంగాణ ఏర్పడిన తర్వాత మరింత సేవలు అందించారు.
రైతు సంక్షేమం, విద్య, ఆరోగ్యం, రహదారుల అభివృద్ధి తదితర విషయాల్లో ఆయన చేపట్టిన కార్యక్రమాలు సాలురా మండల అభివృద్ధికి పునాది వేసాయి. నిత్యం ప్రజల కోసం కృషి చేసిన ఆయన, “నేనున్నా” అనే మాటతో గ్రామస్తుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు.
చివరగా, బుద్దే రాజేశ్వర్ గారు చూపించిన మార్గం ఇప్పటికీ యువతకు మార్గదర్శనంగా నిలుస్తోంది. ఆయన సేవా ప్రస్థానం భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలుస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు….
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








