V1News Telangana

best news portal development company in india

పోషణ పక్వాడ” కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలకు, తల్లులకు అవగాహన…..

SHARE:

– కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు విరివిగా ఉపయోగించడం వలన అధిక పోషకాలు లభిస్తాయని వివరణ

– పాలు, కోడిగుడ్లు, పప్పు దినుసులలో క్యాల్షియం మోతాదు అధికంగా లభిస్తుందని సూచనలు

– పసిపిల్లల ఎదుగుదల మరియు బరువుల విషయంలో తల్లులు నిర్లక్ష్యం వహించకూడదని విజ్ఞప్తి

– గర్భిణీలు ఆరోగ్య సూత్రాలు సక్రమంగా పాటించడం వల్ల సుఖప్రసవాలు జరిగి పుట్టే పిల్లలు అధిక రోగనిరోధక శక్తిని కలిగి ఉంటారు

– ఐసిడిఎస్ సూపర్వైజర్ వాణి

నసురుల్లాబాద్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నస్రుల్లాబాద్ మండలంలోని దుర్కి గ్రామంలో శనివారం రోజు గ్రామంలో గల 3వ అంగన్వాడీ కేంద్రంలో “పోషణ పక్వాడ”కార్యక్రమంలో భాగంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ వాణి ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు మరియు తల్లులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ వాణి మాట్లాడుతూ స్థానికంగా దొరికే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు విరివిగా ఉపయోగించడం వలన అధిక పోషకాలు లభిస్తాయని వివరించారు. పాలు, కోడిగుడ్లు, పప్పు ధాన్యాలు వినియోగించడం వలన వాటిలో అధికంగా కాల్షియం శాతం కలిగి ఎముకలు బలంగా ఉండడానికి మరియు ప్రసవం జరిగే సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా సహాయపడతాయని తెలిపారు. పసిపిల్లల ఎదుగుదల మరియు వారి బరువుల విషయంలో తల్లులు నిర్లక్ష్యం వహించకూడదని విజ్ఞప్తి చేశారు. గర్భిణీలు ఆరోగ్య సూత్రాలు సక్రమంగా పాటించడం వలన సుఖప్రసవాలు జరిగి పుట్టబోయే బిడ్డలు ఆరోగ్యంగా, బరువుగా, అధిక రోగనిరోధక శక్తిని కలిగి జన్మిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో MLHP, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయిని, గ్రామపంచాయతీ కార్యదర్శి, ఏఎన్ఎం, అంగన్వాడి టీచర్లు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india