– కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు
బీర్కూర్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: బీర్కూర్ మండల కేంద్రంలో శుక్రవారం రోజు కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు మియాపురం శశికాంత్ ఆధ్వర్యంలో లబ్ధిదారునికి ముఖ్యమంత్రి సహాయనిధి రూ.60,000 చెక్కును అందజేశారు. గత కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో చికిత్స పొందిన గౌండ బావో రేఖ ముఖ్యమంత్రి సహాయనిధి కొరకు దరఖాస్తు చేసుకోగా శుక్రవారం రోజు నాయకులందరూ కలిసి ఆమె కుటుంబ సభ్యులకు అందజేశారు. లబ్ధిదారులు ముఖ్యమంత్రికి మరియు వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి లకు అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయనిధి అందే విధంగా కృషిచేసిన స్థానిక నాయకులకు కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ యమ రాములు, మాజీ ఎంపీపీ రఘు, మాజీ ఎంపీటీసీ సందీప్, నాయక్, ఆవారి గంగారం, రఫి, రాజు, మన్నాన్, ప్రశాంత్, ఆరిఫ్, అరుణ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








