బాసర, ఏప్రిల్ 16:
GO No 21 తొలగించాలని డిమాండ్ చేస్తూ గత వారం రోజులుగా నిరసన కార్యక్రమం చేపట్టిన బాసర IIIT కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు మరియు అధ్యాపకులను ముధోల్ నియోజకవర్గం BRS సమన్వయ సమితి సభ్యులు డా. కిరణ్ కొమ్రేవార్ ఈ రోజు స్వయంగా కలుసుకున్నారు. వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, న్యాయం జరిగే వరకు తమ పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా డా. కిరణ్ మాట్లాడుతూ, “ఇది విద్యావ్యవస్థను నిర్లక్ష్యం చేసే నిర్ణయానికి వ్యతిరేకంగా న్యాయ పోరాటం. ఇలాంటి విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించి, ఆ జీవోను రద్దు చేయాలి,” అని పేర్కొన్నారు.
ఈ నిరసన కార్యక్రమంలో బాసర మండల నాయకులు కోర్వ శ్యామ్, భైంసా పట్టణ నాయకులు, కుబీర్ మండల నాయకులు మరియు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.
BRS పార్టీ నాయకత్వం విద్యా ఉద్యోగులతో కుడి బద్దంగా నిలబడి, సమస్యను అధికారిక స్థాయిలో ఉంచి, సాధ్యమైనంత త్వరగా పరిష్కారం కోసం కృషి చేస్తుందన్న విషయం స్పష్టం చేశారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








