మొక్కజొన్న రైతుల పరిస్థితి ఆగమ గోచరం – గిట్టుబాటు ధర కల్పించాలని విజ్ఞప్తి…
నిజామాబాద్ జిల్లా బాన్సువాడ, బోధన్ నియోజకవర్గాల్లోని కోటగిరి, సాలూరు మండలాల్లో మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వేల ఎకరాల్లో పండించిన మొక్కజొన్నను రోడ్లపై, కల్లాల్లో ఆరబోసిన రైతులకు ఇప్పటికీ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి రాలేదు.
ప్రతి సంవత్సరం కేంద్రాల లేకపోవడం, బ్రోకర్ల చేతికి అమ్మకాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కనీసం ₹2500 ధర వస్తే గిట్టుబాటు అవుతుందని రైతులు చెబుతుండగా, బ్రోకర్లు మాత్రం ₹1800–₹2000 మాత్రమే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది రైతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
అంతేకాదు, కొన్ని విత్తన కంపెనీలు నకిలీ విత్తనాలు సరఫరా చేసినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. దీని ప్రభావంగా ఎకరాకు 45 కింతల బదులు కేవలం 20 కింతలు మాత్రమే దిగుబడి వచ్చినట్లు తెలిపారు. వర్షాల వల్ల ధాన్యం నష్టపోతున్నప్పటికీ ఎలాంటి భరోసా లేకపోవడం వల్ల కొందరు రైతులు ఆత్మహత్యల శరణం తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.
ప్రభుత్వం తక్షణమే స్పందించి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి. గిట్టుబాటు ధర కల్పించి, కౌలు రైతులకు న్యాయం చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు…
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








