Post Views: 135
మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహావిష్కరణ ఉత్సవం
V1 న్యూస్ తెలంగాణ ప్రతినిధి రామగుండం ఏప్రిల్ 11:-
జిడికే ఓసి 5లో మహాత్మ జ్యోతిరావు పూలే 198వ జయంతి సందర్భంగా బీసీ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విగ్రహావిష్కరణ మహోత్సవం ఘనంగా జరిగింది. రాజ్యసభ ఎంపీ ఆర్. కృష్ణయ్య, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్, జీఎం డి. లలిత్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ, పూలే సామాజిక సంస్కరణలు, బడుగు వర్గాల అభ్యున్నతికి చేసిన కృషిని కొనియాడారు. బీసీ ఉద్యోగులు ఐక్యంగా ఉంటూ, ఉన్నత విద్య ద్వారా ఉన్నత స్థానాలు సాధించాలని సూచించారు. సింగరేణిలో బీసీలకు అన్ని ప్రయోజనాలు అందించేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.
Author: Namani Rakesh Netha
STAFF REPORTER RAMAGUNDAM








