V1News Telangana

best news portal development company in india

జాడి, జమాల్పూర్ చెరువుల్లో వేల సంఖ్యలో చేపల మరణం – బాధితుల న్యాయదోవలకై పిలుపు…. . చెరువుల్లో చెట్లు తొలగించకపోవడం, నీటి నిల్వలేఖ – దారుణమైన పరిణామాలు..

SHARE:

, నిజామాబాద్ జిల్లా:సాలూర మండలం జాడి మరియు జమాల్పూర్ గ్రామ శివారులో ఉన్న 82 ఎకరాల పరిధి కలిగిన చెరువులో, వేల సంఖ్యలో చేపలు చనిపోయి ఒడ్డుకు వచ్చి పడటంతో చెరువు పరిసర ప్రాంతాల్లో దుర్వాసన కలుగుతోంది. మత్స్యకారులు ఈ దుర్స్థితిని వర్ణిస్తూ, ప్రతి ఏడాదీ ఇదే పరిస్థితి పునరావృతమవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చెరువు లోతు లేకపోవడం, నీటి నిల్వలు సరిగ్గా లేకపోవడం, చెరువు ప్రాంతంలో ఉన్న చెట్ల వల్ల నీరు నిలకడగా ఉండకపోవడం వంటి కారణాలతో మృత్యుముఖం పడుతున్న చేపలు, మత్స్యకారుల జీవనాధారాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నాయి. ప్రభుత్వ పథకాల ద్వారా చేపల విత్తనాలు వేసినా, వడగాలులకు నీరు వేడి కావడం, బురద పెరగడం, చేపల మరణానికి దారితీస్తున్నాయి.

మత్స్యకారులు చెరువుకు సర్వే చేయమని మూడుసార్లు అధికారులకు డబ్బులు ఇచ్చి కోరినప్పటికీ, సర్వే సరైన రీతిలో చేయలేదని వాపోతున్నారు. అలాగే, చెరువు సుమారు 15 నుంచి 20 ఎకరాల వరకు కబ్జా అయిందని, తిరిగి ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు…

మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ వద్దకు అనేకమార్లు వెళ్లినా, చెట్లు తొలగింపు పై చర్యలు తీసుకోలేదని మత్స్యకారులు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని, చెరువులో నీటిని నిలిపే విధంగా చర్యలు తీసుకొని, మత్స్యకారులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india