– మాజీ సర్పంచ్, విజయలక్ష్మి ధన్వశ్రీ రైస్ మిల్ యజమాని
– కమ్మ సత్యనారాయణ
బీర్కూర్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: బీర్కూర్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ , విజయలక్ష్మి ధన్వశ్రీ రైస్ మిల్ యజమాని కమ్మ సత్యనారాయణ నసురుల్లాబాద్ మరియు బీర్కూర్ మండలాలకు చెందిన హనుమాన్ మాలాధారణ స్వాములకు భిక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. హనుమాన్ భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పిట్ల కృష్ణ మహారాజ్ అతిథిగా హాజరయ్యి భక్తులకు ప్రవచనాలను బోధించారు. సనాతన ధర్మ పరిరక్షణ కొరకు అందరూ భక్తి మార్గంలో నడవాలని సూచించారు. మాలాధారణ ధరించడం వలన భక్తితో పాటు క్రమశిక్షణ కూడా కలుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా మహిళలు భక్తి పాటలతో, భజన సంకీర్తనలతో అలరించారు. రామనామ స్మరణలు, హనుమాన్ నామ స్మరణలతో ప్రాంగణం ఆధ్యాత్మిక కలను సంతరించుకుంది. స్వామివారికి నైవేద్యం సమర్పించి హనుమాన్ మాలధారణ భక్తులు ప్రసాదాన్ని స్వీకరించారు. భిక్ష అనంతరం స్వాములకు తాంబూలం అందించి సత్కరించారు. స్వాములు నిండు మనసుతో ఆంజనేయస్వామి కృపాకటాక్షాలతో అందరూ ఆయురారోగ్యాలతో, పాడి పంటలతో సుభిక్షంగా జీవించాలని ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమానికి ప్రతాప్ సింగ్ రాథోడ్, రాంబాబు, మాజీ జెడ్పిటిసి మల్లాపూర్ సతీష్, నాయకులు, కార్యకర్తలు, భక్తులు, గ్రామ ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








