నిరుపేద కుటుంబానికి ఆర్థిక చేయూతను అందిస్తూ ‘మీ కోసం మేము సేవా సంస్థ’ తమ దాతృత్వాన్ని చాటారు. బోధన్ పట్టణంలోని తట్టికోట్ కాలనీకి చెందిన లింగం అనే వ్యక్తి ఇటీవల ఆకస్మికంగా మరణించారు. ఆయన్ని కోల్పోయిన కుటుంబం తీవ్ర పేదరికంలో ఉంది.ఈ విషయంలో దూపల్లి గ్రామానికి చెందిన గోగు శ్రీకాంత్ సేవా సంస్థ ప్రతినిధులకు సమాచారం అందించారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే సంస్థ ప్రతినిధులు స్పందించి మంగళవారం బాధిత కుటుంబానికి రూ.10,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఈ సందర్భంగా కాలనీవాసులు మరియు బాధిత కుటుంబ సభ్యులు ఆర్థిక సహాయం చేసిన ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. సేవా సంస్థ చేపడుతున్న కార్యక్రమాలను ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు, ప్రజా సంఘాల నాయకులు, పెద్దలు అభినందించారు.ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు శివ, శ్రీకాంత్ మరియు బోధన్ పట్టణ వాసులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








